Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.12కోట్ల గంజాయి పట్టివేత

రూ.12కోట్ల గంజాయి పట్టివేత

- Advertisement -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్‌

శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12కోట్ల విలువ చేసే గంజా యిని శనివారం అధికారులు పట్టు కున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత దేశానికి చెందిన ఓ ప్రయాణికులు వచ్చింది. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ లోని డీఆర్‌ఐ అధికారులు ఆమె ను అడ్డగించారు. ఆమె సామాన్లను తనిఖీ చేశారు. ముద్దగా ఉన్న పదార్థపు ప్యాకెట్లను గుర్తించారు. మొత్తం 6 కిలోల హైడ్రోపోనిక్‌ కలుపును(పదార్థం) స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిర్వహించిన పరీక్షలో అది గంజాయికి సానుకూల పదార్థమని తేలింది. ప్రయాణికురాలిని విచారించగా.. ఆమెకు చెందిన మరో చెక్‌-ఇన్‌ బ్యాగ్‌ తప్పుగా ఉంది. దాని కోసం ఆమె అప్పటికే ఫిర్యాదు చేసింది. ఆ సామాను కూడా హైదరాబాద్‌కు చేరుకుంది. దీన్ని కూడా పరిశీలించి.. అందులో మరో 6 కిలోల హైడ్రోపోనిక్‌ కలుపును గుర్తించారు. మొత్తం 12 కిలోల హైడ్రోపోనిక్‌ కలుపును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.12కోట్లు ఉంటుంది. ఎన్‌డీపీఎస్‌ చట్టం, 1985 నిబంధనల ప్రకారం ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -