Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపుస్తక పఠనంతో మేథోశక్తి వృద్ధి

పుస్తక పఠనంతో మేథోశక్తి వృద్ధి

- Advertisement -

చరిత్రను యువత అధ్యయనం చేయాలి: జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌
నవతెలంగాణ పుస్తక ప్రదర్శనశాల ప్రారంభం

నవతెలంగాణ-వనపర్తి
విద్యార్థి దశ నుంచి పండు ముసలి వరకు పుస్తక పఠనంతోనే మేధోశక్తి వృద్ధి చెందుతుందని జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రావుల గిరిధర్‌ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో శనివారం నవతెలంగాణ పుస్తక ప్రదర్శన శాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ ప్రారంభించారు. ఎస్పీకి నవ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ వాసు, ఉమ్మడి జిల్లా మేనేజర్‌ కార్తీక్‌, ఉమ్మడి జిల్లా ప్రతినిధి పరిపూర్ణం, డెస్క్‌ ఇన్‌చార్జి భాస్కర్‌, వనపర్తి జిల్లా ఏడీవీటీ ఇన్‌చార్జి బాబు, రిపోర్టర్‌ రాము పూలబొకేలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేటి యువతీ యువకులు ఎంతో మందికి చరిత్ర తెలియక, ఉద్యోగాలు సాధించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనశాలల్లో చరిత్ర ఆనవాళ్లకు సంబంధించి ఎన్నో పుస్తకాలు ఉంటా యని, వాటిని కొనుక్కుని అధ్యయనం చేయడం ద్వారా మేధో సంపత్తి పెరుగుతుందని సూచించారు. ఎలెక్స్‌ హెలీ రచించిన ఏడు తరాలు, నండూరి రామ్మోహన్‌రావు రచించిన విశ్వ విజ్ఞానదర్శిని, సత్యాన్వేషణ, కాళోజీ రచించిన ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ వంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయని వాటిని యువత కొని చదవాలన్నారు. వాటితో పాటు చట్టాలు, న్యాయవ్యవస్థల తీర్పులు, లాండ్‌ ఆర్డర్‌, ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని సూచించారు.

చిన్ననాటి నుంచే తమ అభిరుచులకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశిం చుకుని విద్యనుభ్యసిస్తూనే సమాజానికి సంబంధిం చిన ఎన్నో సంఘటనలు సమాచార సేకరణలు చేయడంతో వివేకవంతులుగా తయారవుతారని చెప్పారు. ప్రతి కుటుంబంలోనూ చిన్ననాటి నుంచి పిల్లలకు చదవడం అలవాటు చేయాలని సూచిం చారు. అనంతరం ఎస్పీని నవ తెలంగాణ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జబ్బార్‌, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ మాజీ సభ్యులు గంధం నాగరాజు, నవతెలంగాణ పబ్లిషింగ్‌ బుకహేౌస్‌ ఇన్‌చార్జి కొమ్ము సత్యం, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల ఏడివిటి ఇన్‌చార్జీలు ప్రవీణ్‌, రమేష్‌, లక్పతి, తిరుమలేష్‌, కుమార్‌, దిలీప్‌, ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -