Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశంషాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్‌

శంషాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్‌

- Advertisement -

పలు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులు
17 తులాల బంగారం, 50 తులాల వెండి, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నవతెలంగాణ- శంషాబాద్‌

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వి.శ్రీకాంత్‌గౌడ్‌ మీడియాకు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లి గ్రామానికి చెందిన గుల్ల శివప్రసాద్‌, దంగట్ల లోకేష్‌, మండలి మనోహర్‌ హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ (కేబీహెచ్‌పీ)లోని మెన్స్‌ హాస్టల్‌లో ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి పలు దొంగతనాలు చేశారు. శంషాబాద్‌లోని రాల్లగూడ గ్రామం రాఘవేంద్ర కాలనీకి చెందిన నీలం సింగ్‌- వీరేంద్ర ప్రతాప్‌సింగ్‌ దంపతుల ఇంట్లో ఈనెల 9వ తేదీన చోరీ జరిగింది.

వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌తోపాటు విశ్వసనీయ సమాచారాన్ని సేకరిం చారు. వాటి ఆధారంగా ముగ్గురు నిందితులు శివప్రసాద్‌, లోకేష్‌, మనోహర్‌ ను అరెస్టు చేశారు. వీరి నుంచి 17 తులాల బంగారం, 50 తులాల వెండి, గ్లామర్‌ బైక్‌, పల్సర్‌ బైక్‌, ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు నిందితులు ఆర్టీఐ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌, ఎయిర్‌పోర్టులో, తాడూరు పోలీస్‌స్టేషన్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. పది రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించి, రివార్డు అందజేశారు. రివార్డు అనుకున్న వారిలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.బాలరాజు, డిటెక్టివ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌ గ్యార, పోలీస్‌ సిబ్బంది బి. శ్రీకాంత్‌, ఎండి. జావిద్‌ ఎం.సిద్దేశ్వర్‌, పి.వెంకట్‌రెడ్డి, జె.కవిత ఉన్నారు.

సీసీ కెమెరాలు అమర్చుకోవాలి : ఏసీపీ
నేరాల నియంత్రణ కోసం ముందు జాగ్రత్త చర్యగా ఇండ్ల ముందు, వ్యాపార స్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ తెలిపారు. నేరాలను అరిక ట్టడంతో పాటు నేరం జరిగిన తర్వాత నిందితులను వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -