Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకాలను చెరిపేస్తున్న మౌన శత్రువు

అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకాలను చెరిపేస్తున్న మౌన శత్రువు

- Advertisement -

వినాయక ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. గౌతమ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో, అల్జీమర్స్ అనే మౌనశత్రువుపై అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. వృద్ధాప్యంలో సాధారణంగా కనిపించే ఈ వ్యాధి క్రమంగా జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తూ, వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రవర్తన, రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదట చిన్న విషయాలు మరచిపోవడం, మాటలలో తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత దశల్లో, రోగి తన కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్ మందికిపైగా డిమెన్షియాతో బాధపడుతున్నారు, వీరిలో 60-70% కేసులు అల్జీమర్స్ వల్లే వస్తున్నాయి.

నిజామాబాద్ ప్రజలకు డా, గౌతమ్ సలహా……

ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం మనకు మానసిక మరియు గట్ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకునే మంచి అవకాశం ఇస్తుంది. ఈ సందర్భంగా మానసిక సమస్యలపై ఉన్న సాంఘిక అపహాస్యాన్ని (స్టిగ్మాను) తొలగించడం, జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం, అలాగే మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరం.జ్ఞాపకాలను కాపాడుకోవాలంటే అవగాహన, ప్రేమ, మరియు ముందస్తు సంరక్షణే ప్రధాన ఆయుధాలు, అల్జీమర్స్ వంటి వ్యాధులను అరికట్టాలంటే ముందుగానే అవగాహన కలిగి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం తప్పనిసరి. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక శ్రేయస్సు సాధిస్తే, మన వృద్ధాప్యం సానుకూలంగా, జ్ఞాపకాలతో నిండుగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -