Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంబీబీఎస్ సీటు సాధించిన రోశ్ని పాటిల్

ఎంబీబీఎస్ సీటు సాధించిన రోశ్ని పాటిల్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామానికి రోషిని పాటిల్ వన్నె తెచ్చారు. సుల్తాన్పేట్ గ్రామ నివాసులు రాజ్ కుమార్, ప్రీతం పాటిల్ దంపతుల కుమార్తె రోశ్ని పాటిల్ కామినేని హాస్పిటల్ ఎల్.బి.నగర్ లో గవర్నమెంట్ కోటాలో 699 ర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇది గ్రామానికి నిజంగా గర్వకారణం. మీ కృషి, పట్టుదల ఫలించిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు ఆ విద్యార్థినికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. మీ ప్రయాణం విజయాలతో నిండిపోవాలని గ్రామ ప్రజలు తోటి విద్యార్థిని విద్యార్థులు, గురువులు, తల్లి తండ్రులు, బంధు మిత్రులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -