- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం డీకంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నూతన భవన్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహచారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గ మాట్లాడుతూ,గ్రామస్థులందరికీ సౌకర్యవంతమైన వేదికగా ఈ నూతన పంచాయతీ భవన్ నిలుస్తుంది అని, గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నాం అని ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడం మా లక్ష్యం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దినేష్, ఏఈ సూర్య, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -