Monday, September 22, 2025
E-PAPER
Homeఖమ్మంగిరిజనులు మధ్య తనయుడి పుట్టిన రోజు వేడుకలు

గిరిజనులు మధ్య తనయుడి పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

– రూ.40 వేల వ్యయంతో కొండ రెడ్లుకు నూతన వస్త్రాలు అందజేత
– ఔదార్యం చాటుకున్న అగ్రికల్చర్ ప్రొఫెసర్ తమ్మినన శ్రావణ్ కుమార్, స్వేత దంపతులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

“సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడ్పడవోయ్” అనే మహనీయుల సూక్తిని నిజం చేస్తూ తన తనయుడు దర్శన్ మూడో పుట్టిన రోజు ను సోమవారం దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ మారుమూల గిరిజన ప్రాంతం లో కొండ రెడ్లు ఆవాసం లో నిర్వహించి ఆచరించి చూపారు స్థానిక వ్యవసాయ కళాశాల సహాయ ప్రొఫెసర్ తమ్మినన శ్రావణ్ కుమార్, స్వేత దంపతులు  ఆ గ్రామంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

మండలంలోని గోగులుపుడి లో సుమారు 170 మంది జనాభా లో రూ.45 వేలు వ్యయం తో మగవాళ్ళకు లుంగీ,టవల్,స్త్రీలకు శారీ,పిల్లలకు జత బట్టలను నూతన వస్త్రాలను పంపిణీ చేసారు. దీంతో ఆ గిరిజన గూడెం లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. గిరిజనులు మధ్య తన తనయుడి పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని,ఈ గ్రామంలో అక్షరాస్యత పెంపు పై దృష్టి సారిస్తాం అని ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్,స్వేత దంపతులు హర్షం వెలిబుచ్చారు.

ముందుగా ఈ గ్రామంలో పీహెచ్ సీ గుమ్మడి వల్లి వైద్యారోగ్య సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు పీ.వెంకటేశ్వరరావు, ఆశా కార్యకర్తలు సమత,మంగ,సీత,ఏఎన్ఎం రాధ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -