Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ధర్నా..

అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తో నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బోధన్ _ మెదక్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేలు నష్టపరిహారం చెల్లించాలి లేకుంటే భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.

గత 25 రోజుల నుండి పంట పొలాలన్నీ నీటిలో ఉన్నాయని రైతుల గురించి పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే అమెరికాలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సంఘటన స్థలానికి తహసిల్దార్ శ్రీనివాసరావు ఎస్ఐ భార్గవ్ గౌడ్ చేరుకొని ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థసింహారెడ్డి తో మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు ఫోన్ లో మాట్లాడించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చూస్తామని చెప్పడంతో ధర్నా వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, రైతు నాయకుడు బోల్లు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి జయరాజ్, మాజీ ఎంపీపీ రాజదాస్, భారతీయ కిసాన్ నాయకుడు కాంత్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -