నవతెలంగాణ – మల్హర్ రావు
గుడుంబా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సోమవారం మండల పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు ప్రోహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జి.అంజన్ రావు, వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ వి.శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ టీమ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్,భూపాలపల్లి టిమ్, ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్-కాటారం, సంయుక్తగా సోమవారం మహాముత్తారం మండలంలోని రెడ్డి పల్లి, కనుకునూర్, సింగంపల్లి గ్రామాల్లో నాటు సారాయి తయారీ స్థావారాలపై చేశారు.
8 మంది తయారు దారులపై కేసులు నమోదు చేసి, 6 మంది నిందితులను అరెస్ట్,50 లీటర్ల నాటుసాయిరా స్వాధీన పరుచుకున్నారు. 2400 లీటర్ల చక్కర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. నాటుసారాయిని తయారు చెసినా, విక్రయించినా, రవాణ చెసిన చట్టపరమైన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిష్టయ్య, బాదావత్, రాజ సమ్మయ్య, రజిత, రాంచందర్, శ్రీకాంత్, వెంకట రాజు, కోటేశ్వర్, వీర స్వామి, విమల, రాజు, సునిల్, దయానా పాల్గొన్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES