Monday, September 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు

భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు

- Advertisement -
  • ఆందోళన చెందుతున్న పత్తి , సొయా రైతులు
  • పెట్టుబడులు రాని దుస్థితిలో పంటలు
  • నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతన్నలు..
    నవతెలంగాణ – కుభీర్
    ప్రతి సంవత్సరం అతివృష్టి, అన వృష్టి వల్ల రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈఏడాది లోనైనా పంటలు బాగా పండి కష్టాలు తీరుతాయి అనుకున్న రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశను కల్పించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కొద్ది రోజుల్లో చేతుకు వస్తాయన్న సమయంలో భారీ వర్షాలు కురావడం తో పంటలు పూర్తిగా నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పంటలను చూస్తే పెట్టుబడులు కూడా వచ్చేట్లు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    కుబీర్ మండల వ్యాప్తంగా 50వేల788 ఎకరలో వివిధ పంటల సాగు భూమి ఉంది. ఇందులో పత్తి పంట24వేల 66ఎకరలు సొయా పంట 22వేల 855ఎకరాలు , వారి 101ఎకరాలు , కంది 3 వేల ఎకరాలలో మిగితా పంటలు రైతులు తమ తమ పంట పొలాల్లో పంటలను సాగు చేశారు. ఈ సంవత్సరం మృగశిర కార్తెకు ముందే వర్ష లు కురవడంతో ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగుచేశారు. విత్తనాలు విత్తినప్పటి నుండి సరైన సమయానికి వర్షాలు కురవడంతో పంటలు ఏపుగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటలు కాయ, పుత దశలో మంచి వర్షాలు కురవడంతో ఈసారి దిగుబడులు వస్తాయన్న కొండంత ఆశ రైతుల ముఖాల్లో సంతోషం కనిపించింది. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు.

    ఒక్కసారి గా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురావడంతో మళ్ళీ రైతుల కంటిలో నీళ్లు మొదలయ్యాయి. సొయా పంట కోత దశలోనే వర్షాలు అధికంగా కురావడంతో పంట క్షేత్రాల్లో నీళ్లు నిల్వ ఉండి సొయా పంట పూర్తిగా తడిసి ముద్ద కావడంతో కాయల్లోనే గింజలకు మొలకలు వచ్చి కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడడంతో రైతులు వాపోతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పెట్టుబడులు కూడా వచ్చేట్లు కనిపించకపోవడంతో రైతులు కంటి తడి పెట్టు కుంటున్నారు. ఇప్పటికైనా వర్షాలు తగ్గు ముఖం పట్టకుంటే వచ్చే కాస్త గింజలు చేతికి వచ్చేట్లు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కాళ్ళ ముందే పూర్తిగా నెల పాలు అవుతుండడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దింతో ప్రభుత్వం నష్టపోయిన పంటలకు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుచున్నారు.

    పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు: నారా రాజు యువ రైతు కుభీర్
    గత నెల రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎకరానికి రూ. 20 వేల నుండి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టాము పంటల పరిస్థితి చూస్తే పెట్టుబడులు కూడా వచ్చేట్లు కనిపించడం లేదు.
    ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి: అన్నెవర్ గజేందర్ పార్డి (బి)
    భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. చేనులోకి వెళ్లి పంటలను చూస్తే కళ్ళని నిండా నీళ్లు నిండుతున్నాయని, కండ్ల ముందే పంటలు నేను పలు కావడంతో ఆత్మహత్యలే శరణ్యం మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -