Monday, September 22, 2025
E-PAPER
Homeబీజినెస్యువో టెక్+ 475 DIని ఆవిష్కరించిన మహీంద్రా

యువో టెక్+ 475 DIని ఆవిష్కరించిన మహీంద్రా

- Advertisement -

నవతెలంగాణ – ముంబై: భారతదేశపు నంబర్ వన్ ట్రాక్టర్ బ్రాండ్ అయిన మహీంద్రా ట్రాక్టర్స్ సరికొత్తగా మహీంద్రా యువో టెక్+ 475 DI (YUVO TECH+ 475 DI) పేరిట 42 హెచ్‌పీ ట్రాక్టరును ఆవిష్కరించింది. వ్యవసాయం మరియు వ్యవసాయేతర పనులను కూడా సులభంగా చక్కబెట్టే విధంగా అసాధారణమైన పనితీరు, ఆధునిక సాంకేతికత, మరింత శక్తితో రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక ఉత్పాదకత, మరింతగా ఇంధనం ఆదా చేయగలిగే విధంగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన మహీంద్రా యువో టెక్+ 475 DI, దేశవ్యాప్తంగా రైతులకు విశ్వసనీయమైన భాగస్వామిగా నిలుస్తుంది.

యువో టెక్+ 475 DIలో శక్తివంతమైన 2980 సీసీ ఎంబుల్ (mBULL) 3 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 191 Nm టార్క్‌ను మరియు అబ్బురపర్చేలా 28 శాతం బ్యాకప్ టార్క్‌ను అందిస్తుంది. కీలకమైన ఇంజిన్ విడిభాగాలను నీరు మరియు కలుషితాలు దెబ్బతీయకుండా నివారించడం ద్వారా వాటర్ సెపరేటరు, ఇంజిన్ యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది. ఇంధనం నుంచి నీటిని తొలగించడం ద్వారా వాటర్ సెపరేటరు అనేది తుప్పు పట్టడం, ఇంధనం సిస్టంలో అడ్డంకులు ఏర్పడటంలాంటి రిస్కులను తగ్గించి, ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంజిన్ జీవితకాలాన్ని పెంచుతుంది.

ఇందులోని మల్టీ-స్పీడ్ పీటీవో (ఎంఎస్‌పీటీవో) అనేది నిర్దిష్ట పనులకు అనుగుణంగా, అంటే రోటావేటరును నడపడం లేదా బెయిలర్‌ను ఉపయోగించడం లేదా ఇతరత్రా పరికరాలను ఆపరేట్ చేయడంలాంటి వాటికి తగ్గట్లుగా పీటీవోను సరి చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల టర్నెరౌండ్ సమయం వేగవంతం కావడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఫలితంగా నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.

డ్యుయల్ క్లచ్ టెక్నాలజీ, 12 ఫార్వార్డ్ మరియు 3 రివర్స్ గేర్ల వల్ల, కఠినతరమైన నేలల్లో పని చేస్తున్నప్పుడు లేదా భారీ లోడ్‌లు లాగుతున్నప్పుడు కూడా సముచితమైన వేగంతో ఇది పని చేస్తుంది. ఈ కొత్త ట్రాక్టర్లలో హెవీ-డ్యూటీ హైడ్రాలిక్స్ ఉన్నాయి. 2000 కేజీల లిఫ్ట్ సామర్థ్యాలు, 29 lpm (నిమిషానికి లీటర్లు) హైడ్రాలిక్ పంపు ప్రవాహ సామర్థ్యాల వల్ల భారీ పనులను కూడా మహీంద్రా యువో టెక్+ 475 DI ఇట్టే చక్కబెట్టగలదు.

యువో టెక్+ 475 DIని డిజైన్ చేసేటప్పుడు ఆపరేటర్ల సౌకర్యాన్ని కూడా మహీంద్రా దృష్టిలో ఉంచుకుంది. అందుకే ఎర్గోనామిక్‌గా డిజైన్ చేసిన విశాలమైన సీటింగ్ ఏరియా, పవర్ స్టీరింగ్ సిస్టం, సులభంగా అందుబాటులో ఉండే కంట్రోల్స్ లాంటి అంశాలు, సుదీర్ఘమైన పని వేళల్లో ఆపరేటర్‌కి అలసట తగ్గించే విధంగా ఉంటాయి.

నిశ్చింతని ఇచ్చే విధంగా యువో టెక్+ 475 DIపై పరిశ్రమలోనే అత్యుత్తమంగా మహీంద్రా 6 ఏళ్ల వారంటీ అందిస్తోంది. ట్రాక్టర్ యొక్క మన్నికపై మహీంద్రాకు గల నమ్మకాన్ని, అలాగే మరింత శక్తివంతంగా, ఆధునిక టెక్నాలజీతో మరిన్ని పనులను నిర్వర్తించడంలో రైతులకు సాధికారత కల్పించడంలో కంపెనీకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -