- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దుబ్బ క్రాంతికుమార్ రాసిన “గెలుపు సంతకం” పుస్తకానికి వసుంధర విజ్ఞాన వికాస మండలి కామారెడ్డి నుండి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా జాతీయ దాశరధి సాహిత్య పురస్కార్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద ప్రజలు జిల్లా సాహిత్య అభిమానులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -