Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌ బెయిల్‌పై ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌ బెయిల్‌పై ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
2020లో నార్త్‌ఈస్ట్‌ ఢిల్లీ అల్లర కేసులో సుప్రీంకోర్టు స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌, గుల్‌ఫిషా ఫాతిమా, మీరన్‌ హైదర్‌, షిఫా ఉర్‌ రెహ్మాన్‌ దరఖాస్తు చేసుకున్న బెయిల్‌ అంశాన్ని పరిశీలించే విషయంలో జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది. వేగంగా ఈ కేసును పరిష్కరించాలని పిటీషనర్లు కోరారు. ప్రీ ట్రయల్‌లోనే నిందితులు ఐదేండ్లు జైలుశిక్ష అనుభవించారని పిటీషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. దీపావళిలోగా ఈ కేసును క్లోజ్‌ చేయాలని కపిల్‌ సిబల్‌ కోరారు. ఓ విద్యార్థిని ఐదేండ్లు జైలులో పెట్టడం షాకింగ్‌గా ఉందని అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. ఢిల్లీ అల్లర కేసు నిందితులకు బెయిల్‌ మంజూరీని నిరాకరిస్తూ సెప్టెంబర్‌ 2న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఖాలీద్‌తో పాటు ఇతరులు సుప్రీంను ఆశ్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -