Tuesday, September 23, 2025
E-PAPER
Homeసినిమావిజువల్‌ వండర్‌..

విజువల్‌ వండర్‌..

- Advertisement -

రిషబ్‌ శెట్టి, హౌంబాలే ఫిల్మ్స్‌ కాంబోలో రూపొందిన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం పాన్‌-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బెంచ్‌మార్క్స్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ లాంచ్‌ చేశారు. ”నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ విజువల్‌ వండర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూ ప్రేక్షకులను కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. రిషబ్‌ శెట్టి యాక్షన్‌ సీన్స్‌లో నెక్స్ట్‌ లెవల్‌లో కనిపించారు. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్‌ అద్భుతంగా కనిపించింది. వీరిద్దరి ప్రేమ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.

దర్శకుడిగా రిషబ్‌ శెట్టి అద్బుతాన్ని ఆవిష్కరించారు. అరవింద్‌ ఎస్‌ కశ్యప్‌ కెమరా వర్క్‌ మార్వలెస్‌గా వుంది. బి అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ యాక్షన్‌ ఎమోషన్‌ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ వినేశ్‌ బంగ్లాన్‌ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశారు. హౌంబలే ఫిలింస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ వరల్డ్‌ క్లాస్‌లో ఉన్నాయి. విజువల్‌ వండర్‌గా నిలిచిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. అక్టోబర్‌ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -