దసరా కానుక

బాలకష్ణ, అనిల్‌ రావిపూడి కాంబి నేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమాలోని శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందమైన చిరునవ్వుతో శ్రీలీల పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ రాంపాల్‌ పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తు న్నారు. విజయదశమి (దసరా) కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి, సంగీతం: ఎస్‌ థమన్‌.

Spread the love