అంచనాలు పెరుగుతున్నారు

Expectations are risingహీరో నాని, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రం నుంచి రిలీజ్‌ అయిన పోస్టర్లు, గ్లింప్సెస్‌, సాంగ్స్‌, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌ హ్యూజ్‌ బజ్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని చిత్ర యూనిట్‌ తెలిపింది. తాజాగా మేకర్స్‌ ఈ హైలీ యాంటిసిపేటెడ్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. ఈనెల 13న ట్రైలర్‌ని విడుదల చేయ నున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఈనెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నాయిక నటించింది.

Spread the love