Thursday, September 10, 2026
E-PAPER
Homeసినిమాపక్కా యాక్షన్ సినిమా

పక్కా యాక్షన్ సినిమా

- Advertisement -

అజయ్ భూపతి దర్శకత్వంలో జయ కృష్ణ ఘట్టమనేనిని హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజాగా విడుదలైన టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. టీజర్ చివర్లో సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భావోద్వేగాన్ని పెంచింది. అజయ్ భూపతి ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని అంశాలను జోడించించారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -