Sunday, May 31, 2026
E-PAPER
Homeసినిమా'పెద్ది`.. ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది : రామ్ చరణ్

‘పెద్ది`.. ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది : రామ్ చరణ్

- Advertisement -

”పెద్ది’ కోసం రెండేళ్ళు చాలా ఇష్టం తో కష్టపడ్డాం. పెద్ది తప్పకుండా ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుందిఅని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో హీరో రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ నటించిన యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ఈనెల 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. రామ్ చరణ్ మాట్లాడుతూ,' ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల ప్రమోషన్స్ కోసం చెన్నైకి వచ్చాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ సెంటర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్. శివన్నని స్క్రీన్‌పై చూస్తే ఓ ఫైర్‌లా అనిపిస్తుంది. ‘జైలర్’లో ఆయన సీన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఆయన కళ్లే ఎన్నో ఎమోషన్స్ మాట్లాడతాయి. రత్నవేలుతో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన బిగ్గెస్ట్ అసెట్.

దివ్యేందు రియల్ లైఫ్‌లో కూడా గ్యాంగ్‌స్టర్‌లా యాక్ట్ చేస్తుంటారు. దివ్యేందు, నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ మాత్రం ఆరున్నర అడుగుల పైనే ఉంటాయి. జాన్వీ ఈ సినిమాకు ఎంతో అందాన్ని తీసు కొచ్చారు. మా నిర్మాత సతీష్ కిలారుకి ధన్యవాదాలు. ఇది కష్టంతో చేసిన సినిమా కాదు, ఇష్టంతో చేసిన సినిమా. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు చేస్తున్నప్పుడే అవి పెద్ద విజయాలు సాధిస్తాయని అనిపించింది. ‘పెద్ది’ విషయంలో కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఇది చాలా స్ఫూర్తినిచ్చే సినిమా. నా కెరీర్‌లో జీవితాంతం దాచుకునే సినిమాల్లో ఇది ఒకటి. బుచ్చిబాబుకి, సుకుమార్ కి థాంక్యూ సో మచ్. ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది. ఇదొక బ్యూటీఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం విజయ్ కి, తమిళ నాడు ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను. విజయ్ ని చూసి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ‘‘పెద్ది’ మంచి ఎమోషనల్ డ్రామా. ఇది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. చరణ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు అంత తేలికగా మర్చిపోలేరు. నిర్మాత సతీష్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే రామ్ చరణ్ని కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను` అని బుచ్చిబాబు సానా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -