Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంఅన్నాడీఎంకే ఐక్యంగా ఉండాలని వ్యక్తి ఆత్మహత్య

అన్నాడీఎంకే ఐక్యంగా ఉండాలని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలోని అంతర్గత కలహాలతో మనస్తాపం చెందిన మహేంద్రన్ (37) అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసి, పార్టీ చీలిక వర్గాలు ఏకం కావాలని, ఎడప్పాడి పళనిసామి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తన మరణానంతరం కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరుతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి మహేంద్రన్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -