దర్శకుడు ప్రశాంత్ వర్మ, మరో సూపర్ హీరో సినిమా ‘అధీర’ కోసం ఆర్.కె.డి స్టూడియోస్‌తో కలిసి పని చేయ బోతున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతుండగా, కీలక పాత్రలో ఎస్.జే.సూర్య కనిపించనున్నారు. రివాజ్ రమేష్ దుగ్గల్ నేతత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రం భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో, గ్రేట్ విజువల్స్‌తో తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎస్.జే.సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. క్రూరమైన రాక్షసుడిలా ఉన్న సూర్య ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్లపై కూర్చుని ధైర్యంతో పైకి చూస్తూ మోడరన్ వార్ అవతార్‌లో ట్రూ సూపర్ హీరోలా ఈ పోస్టర్‌లో కనిపించారు. ఇది ఆశ, అంధకారం మధ్య జరిగే యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్‌ని ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్, స్టంట్స్, గ్రేట్ విజువల్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా థియేటర్స్‌లో థండర్‌క్లాప్ ఎక్స్‌పీరియెన్స్ అందించనుంది అని మేకర్స్ తెలిపారు.