Tuesday, September 23, 2025
E-PAPER
Homeఆటలుమళ్లీ క్యాబ్‌ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..

మళ్లీ క్యాబ్‌ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సోమవారం జరిగిన క్యాబ్‌ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించిన దాదా.. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ పదవికి ఎన్నికయ్యాడు. ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యాన్ని లక్షకు పెంచడం, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో కీలకమైన మ్యాచ్‌లకు ఈడెన్‌ ఆతిథ్యమిచ్చేలా చూడటంపై గంగూలీ దృష్టిసారించనున్నాడు. మరోవైపు, ఈ మైదానంలో ఈ నవంబర్ 14 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈడెన్‌లో ఆరేళ్ల తర్వాత జరగనున్న టెస్టు మ్యాచ్‌ ఇది. ఇక్కడ చివరగా 2019 నవంబర్‌లో భారత్, బంగ్లా మధ్య పింక్ బాల్ (డే/నైట్) టెస్టు జరిగింది. అప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు.

త్వరలో భారత్, సౌతాఫ్రికా మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్ గురించి గంగూలీ మాట్లాడాడు. ‘రెండూ అగ్రశ్రేణి జట్లే. ఇది మంచి టెస్టు మ్యాచ్ అవుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. మ్యాచ్‌కు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఏర్పాట్ల గురించి త్వరలో బీసీసీఐతో మాట్లాడతా. ఈడెన్‌ గార్డెన్స్‌ సీటింగ్ కెపాసిటీ పెంచడం అంటూ ఉంటే అది వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ తర్వాతే’ అని గంగూలీ పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -