Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెటింగ్ ముసుగులో ఘరానా మోసం 

మార్కెటింగ్ ముసుగులో ఘరానా మోసం 

- Advertisement -

పాలకుర్తి కేంద్రంగా మనీ లాండరింగ్ దందా 
రూ.50 కోట్ల మేర పేదల సొమ్ము స్వాహా 
కొంపముంచిన అతి ఆశ 
టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నిర్వాహకుడు 
లబోదిబో మంటున్న అతి ఆశావాహులు 
నవతెలంగాణ-పాలకుర్తి

మార్కెటింగ్ ముసుగులో ఘరానా మోసానికి నిర్వాహకుడు ఒడి కట్టడంతో నిర్వాహకుడి మోసానికి పేదలు బలయ్యారు. పాలకుర్తి కేంద్రంగా మనీ లాండరింగ్ దందా ఊపందుకోవడంతో పేదల సొమ్ము యాభై కోట్ల మేర స్వాహా అయినట్లు ప్రచారం జరుగుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల గుడివాడ చౌరస్తాలో హిప్ జిబ మార్కెటింగ్ ముసుగులో ఆర్బిఎఫ్ పేరుతో నిర్వహకుడు మనీ లాండరింగ్ దందాను యదేచ్చగా కొనసాగించాడు. గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న మార్కెటింగ్ ముసుగులో మనీలాండరింగ్ దందాలో సుమారు 12,000 మంది సభ్యులు మనీలాండరింగ్ స్కీములో చేరినట్లు సమాచారం.

ఆర్ బి ఎఫ్ ముసుగులో ప్రారంభించిన మనీలడరింగ్ దందాలో 6000 నుండి 60 లక్షల వరకు ప్రజలు నగదును జమచేసి ఐడీలు పొందారు. ఐడీలు తీసుకున్న ప్రతి సభ్యుడు ముగ్గురు చొప్పున ఐడీలు చెల్లించేందుకు నిబంధనలు విధించారు. మార్కెటింగ్ ముసుగులో ఆర్ బి ఎఫ్ పేరుతో ప్రారంభించిన మనీలాండరింగ్ దందాలో సుమారు 140 మంది ఏజెంట్లు గా పనిచేస్తూ వెయ్యి 80 మందిని చేర్పించారని సమాచారం. ఏజెంట్లతోపాటు మరికొంతమంది ఆర్ బి ఎఫ్ ముసుగులో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చని నిర్వాహకుడు ప్రజలకు ఆశ కల్పించడంతో సుమారు 12,000 మంది 6000 చెల్లించి ఐడీలు తీసుకున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో పాలకుర్తి గ్రామానికి చెందిన 16 మంది 5 లక్షల చొప్పున ఐడీలు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

ఇటీవలే జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అనేకమంది ఆర్ బి ఎఫ్ ముసుగులో మనీ లాండరింగ్ ఉచ్చులో చెక్కుకున్నారు. 6000 తో ఐడి తీసుకున్న సభ్యునికి 2000 విలువచేసే నిత్యవసర వస్తువులను నిర్వాహకుడు చెల్లించి మోసాలకు ఒడి కట్టాడు. 6000 తో ఐడి తీసుకున్న వ్యక్తికి రెండో నెల నుండి 1000 రూపాయలు తమ ఖాతాలో జమ చేయడంతో ప్రజల్లో అతి ఆశ చెలరేగింది. లక్ష ఇరవై వేలు చెల్లించి ఐడి తీసుకునే వ్యక్తికి రెండవ నెల నుండి 20,000 తమ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చని అతి ఆశ కొంపకు చేటయ్యింది. ఒక్కొక్కరు 60 లక్షల వరకు చెల్లించి ఐడీలు తీసుకున్నారు.

ఆర్ బి ఎఫ్ ముసుగులో మనీ లాండరింగ్ దందాలో దేవాలయ శాఖ, ఐసిడిఎస్ లో పనిచేస్తున్న ఇద్దరితోపాటు మరో 20 మంది కీలక వ్యక్తులు మనీ లాండరింగ్ దందాకు ఏజెంట్లుగా పనిచేస్తూ పేద ప్రజలను తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన పేరుతో మోసం చేశారు. ఆర్ బి ఎఫ్ ముసుగులో మోసాలకు పాల్పడిన నిర్వాహకుడు 2001లో పాలకుర్తి ప్రాంతానికి జీవనోపాధి కోసం వచ్చి పలు చిట్టీలు ప్రారంభించాడు. 2007, 2008 సంవత్సరంలో చిట్టిల పేరుతో ప్రజలను మోసం చేయడంతో బాధితులు అప్పట్లో నిర్వాకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్ బి ఎఫ్ నిర్వాహకుడి పై ఖమ్మం, సూర్యాపేట, ఇల్లందు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల 200 కోట్లకు పైగా ప్రజల నుండి అక్రమ దందాకు పాల్పడడంతో 20కి పైగా కేసులు నమోదయాయని తెలిసింది.

పాలకుర్తి కేంద్రంగా ఆర్బిఎఫ్ ముసుగులో మనీ లాండరింగ్ పేరుతో 50 కోట్లకు వసూళ్లకు పాల్పడడంతో సోమవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆర్బిఎఫ్ నిర్హకుడితోపాటు పలువురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్పీఎఫ్ ముసుగులో మనీ లాండరింగ్ పేరుతో ఏజెంట్లుగా పనిచేసిన వారి గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆర్ బి ఎఫ్ నిర్వాహకుడితోపాటు మరికొందరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మంగళవారం బాధితులు ఆర్ బి ఎఫ్ కేంద్రం వద్దకు బారులు తీరారు. ఆర్ బి ఎఫ లో లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఐడీలు పొందిన బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చని అతి ఆశతో ఆభరణాలను కుదువబెట్టి, అప్పులు చేసి ఐడి తీసుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆర్ బి ఎఫ్ పేరుతో మనీ లాండరింగ్ మోసాలతో సుమారు 100 కోట్లకు పైగా స్వాహా జరిగినట్లు బలమైన చర్చ జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -