మైనర్‌ బాలికపై లైంగిక దాడి..

నవతెలంగాణ – హైదరాబాద్: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తెనాలి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలిక (14)పై కొప్పుల రాజు అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love