నవతెలంగాణ – ముధోల్
మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్ఎంఎఎం)లో 2025-26 సంవత్సరంలో భాగంగా వ్యవసాయ పనిముట్లకై రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి దాసరి రచన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పధకంలో బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్ , రోటావేటర్, స్ట్రా బేలర్, కేజు వీల్స్, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్, బండ్ ఫార్మర్, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్, బ్రష్ కట్టర్ లాంటి వ్యవసాయ పనిముట్లు అర్హులైన రైతుల కు అందజేస్తామన్నారు.
ఇందుకోసం చిన్న, సన్నకారు, ఆసక్తి గల రైతు లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చిన్న, సన్నకారు మహిళా రైతులకు అయితే 50% సబ్సిడీ, జనరల్ రైతులకి 40% సబ్సిడీ తో ఈ రాయితీపై పనిముట్లు అందించనున్నారని పేర్కొన్నారు. ఈ రాయితీని పొందేందుకు రైతు పేరు పై భూమి నమోదై ఉండాలన్నారు. భూమి పాస్ బుక్, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్ సీ ( ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు మాత్రమే). ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఫారంను తమ పరిధి లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారికి అందించవలసిందిగా సూచించారు. ఈ అవకాశం కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వ్యవసాయ పనిముట్లకై దరఖాస్తులకు ఆహ్వానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES