Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీహెచ్సీలో ధన్వంతరి జయంతి 

పీహెచ్సీలో ధన్వంతరి జయంతి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని పిహెచ్సిలో ధన్వంతరి జయంతిని వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం వైద్యులు సురేష్ జ్యోతి ప్రజ్జాలను చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్యురాలు చైతన్య మాట్లాడుతూ… ఆరోగ్యానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే మందులు ఆయుర్వేద మందులని, వాడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. పి హెచ్ సి లో ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆయుర్వేద శిబిరంలో రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సురేఖ, రమ్య, జానకమ్మ, పవన్, శ్రీధర్, రాజు, కవిత, వైద్య సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -