Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరిగిన యూరియా వినియోగం.!

పెరిగిన యూరియా వినియోగం.!

- Advertisement -

మోతాదుకు మించి వాడుతున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో రైతులు యూరియా వినియోగాన్ని పెంచారు. వానాకాలం సీజన్లో వరి 15,500,పత్తి 3,600,మిర్చి 1500 మొత్తం 22,150 ఎకరాల భూమి సాగుకు 2,990 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మండల వ్యవసాయ శాఖ అంచనాలు వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించింది. దాని ప్రకారంగా మండలానికి మూడు నెలల్లో 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది.

ఇంకా మండలానికి 1600  మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. సాగు చేసిన లెక్కల ప్రకారం ఎక రానికి రెండు బస్తాల యూరియా చొప్పున వాడినా మొత్తం 4,200 వేల మెట్రిక్ టన్నులతో పాటు ఇతర కూరగాయల సాగుకు మరో 10 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనా మొత్తం 4,210 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఆవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసి అదనంగా యూరియాను కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో 2,990 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.
ఇప్పటికే 1300 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినప్పటికీ యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు.

ప్రయివేట్ వ్యాపారుల కృత్రిమ కొరత..

మండలంలో  కొందరు ప్రయివేట్ వ్యాపారులు యూరియా కృత్రిమ కొరతను సృషించి రైతులకు ఎక్కువ ధరకు విక్రయించారు. యూరియా 60 శాతం ప్రభుత్వ కేంద్రాలకు 40 శాతం యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు కేటాయి స్తారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరగా ప్రైవేట్ దుకాణాల వద్ద అంతగా రైతులు బారులుదీరలేదు. కేవలం వారి రెగ్యులర్ రైతులకు మాత్రం రూ.400ల నుంచి రూ.450 వరకు విక్ర యించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -