Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లబ్ధిదారులతో భోజనం చేసిన వినయ్ రెడ్డి

లబ్ధిదారులతో భోజనం చేసిన వినయ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజక వర్గ ఇంచార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. మంగళవారం మండలంలోని ముల్లంగి (బి) గ్రామంలో మేడే మావోయూనిక అనే ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఆయన హాజరైయ్యారు. ఆమె దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి, కుటుంబ సభ్యులతో భోజనం చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్, ఫ్లాట్లు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందన్నారు. బి ఆర్ ఎస్ గవర్నమెంట్ గత ఎమ్మెల్యే గాని ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని ఎలాంటి పనులు చేయకపోగా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారన్నారు.

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇదే విధంగా ముల్లంగి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. అనంతరం ఆయన పుట్టిన రోజు సందర్భంగా గ్రామస్తులు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్, ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్,  సింగిల్ విండో చైర్మన్ బుర్రోల్ల అశోక్, శ్రీనివాస్ గౌడ్, మాజీ చైర్మన్  దయాకర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, ఆరిఫ్, పుప్పాల చిన్న, మహబూబ్, విలేజ్ అధ్యక్షులు నరేందర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -