Wednesday, September 24, 2025
E-PAPER
Homeసినిమా'సొగసు చూడతరమా..'

‘సొగసు చూడతరమా..’

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘తెలుసు కదా’. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘మల్లికా గంధ’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్‌ లవ్‌ నెంబర్‌. కాగా, సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్‌ సింగిల్‌ ‘సొగసు చూడతరమా..’ను హీరోయిన్‌ నయనతార మంగళవారం లాంచ్‌ చేశారు. స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్‌ గా పరిచయం అవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవు తుండగా, శ్రీనిధి తన వాచ్‌ సమయాన్ని రీసెట్‌ చేస్తుంది, ఆమె ఇంకా వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా లేదని చూపించే సైన్‌ ఇది. ఈ ట్రాక్‌తో తమన్‌ మరో అద్భుతమైన కంపోజిషన్‌ అందించాడు. బాస్‌లైన్‌, డ్రమ్‌బీట్‌, ట్రంపెట్‌ పాటకు రెట్రో వైబ్‌ను ఇచ్చింది.

కార్తీక్‌ వోకల్స్‌ పాటకు డెప్త్‌, ఎమోషన్‌ని యాడ్‌ చేసింది. కష్ణ కాంత్‌ రాసిన లిరిక్స్‌ అమ్మాయి పట్ల సిద్ధు ఎమోషన్స్‌ని అందంగా ప్రజెంట్‌ చేస్తోంది. విజువల్స్‌ సాంగ్‌కు మరింత బ్యూటీని యాడ్‌ చేశాయి. సిద్ధు, శ్రీనిధి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. సిద్ధు స్టైలిష్‌ డ్యాన్స్‌ మూవ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ ట్యూన్‌, అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాట నేరుగా మ్యూజిక్‌ చార్ట్‌లలో టాప్‌లోకి వెళ్ళింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటలు చార్ట్‌ బస్టర్‌ హిట్స్‌ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్‌ తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌., ఎడిటర్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -