Wednesday, September 24, 2025
E-PAPER
Homeబీజినెస్జీఎస్టీని తగ్గించని ఇ-కామర్స్‌ సంస్థలు..!

జీఎస్టీని తగ్గించని ఇ-కామర్స్‌ సంస్థలు..!

- Advertisement -

30లోగా సమీక్షిస్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ : ఇ-కామర్స్‌ వేదికలు జీఎస్టీ నూతన శ్లాబులను అమలు చేయడం లేదంటూ వస్తోన్న ఫిర్యాదులపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పందించాయి. ఈ ఫిర్యాదులపై ఆరా తీస్తున్నట్టు తెలిపాయి. ధరల మార్పును పర్యవేక్షిస్తున్నామని.. ఫిర్యాదులపై ఇప్పుడే స్పందించలేమని.. సెప్టెంబర్‌ 30లోగా క్షేత్రస్థాయిలో జీఎస్టీ అమలుపై నివేదిక అందనుందని వెల్లడించాయి. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్టీ శ్లాబులను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. అయితే పలు ఇ- కామర్స్‌ వేదికలు పాత జీఎస్టీ రేట్లను వేస్తున్నాయని రిపోర్టులు రావడంతో కేంద్రం స్పందించింది. జీఎస్టీ కొత్త శ్లాబుల అమలు సహా మార్కెట్ల తీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోందని తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -