Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిడిఎస్ యూ విద్యార్థి సంఘం వెల్దండ కమిటీ ఎన్నిక..

పిడిఎస్ యూ విద్యార్థి సంఘం వెల్దండ కమిటీ ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పిడిఎస్యు విద్యార్థి సంఘం  కమిటీని బుధవారం వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెల్దండ మండల  అధ్యక్షుడిగా ఆంజనేయులు (వెల్దండ) ప్రధాన కార్యదర్శిగా సాయి శృతి (ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని), ఉపాధ్యక్షుడిగా శివ (చల్లపల్లి), సహాయ కార్యదర్శిగా శ్రీశాంత్, కమిటీ సభ్యులుగా పవన్ అభిరామ్, చందన, పల్లవి, సుస్మిత దుర్గా శైలజ సింధు, భూదేవి అనూష లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -