– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
– మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో ఆయా పథకాలలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో మండలంలో వివిధ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనితీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పత్తి లబ్ధిదారులతో ఈ ముగ్గుల పోసే కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు.
ఇందుకోసం లబ్ధిదారులను సన్నద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా లబ్ధిదారులకు, సంబంధిత మేస్త్రీలకు అవగాహన కల్పించాలని సూచించారు. హరితహారం మొక్కలను నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంపై అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ పనులపై ఓరియంటేషన్ శిక్షణ పై చర్చించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆయా గ్రామాల పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES