Thursday, September 25, 2025
E-PAPER
Homeసినిమా'ద్రౌపది 2' చిత్రీకరణ పూర్తి

‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి

- Advertisement -

జి.ఎం. ఫిల్మ్‌ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి మోహన్‌.జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రిచర్డ్‌ రిషి ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు సినిమా గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. దర్శకుడు మోహన్‌.జి మాట్లాడుతూ, ‘చిత్రీకరణ సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే పూర్తి చేయ గలిగాను’ అని అన్నారు. ‘దర్శకుడు మోహన్‌ సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే ముందే షూటింగ్‌ పూర్తయింది’ అని నిర్మాత చోళ చక్రవర్తి చెప్పారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను 14వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లి, ఆనాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అద్భుతమైన కథ, విజువల్స్‌, తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో నెలలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని మేకర్లు ప్లాన్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -