Thursday, September 25, 2025
E-PAPER
Homeసినిమా'ఓ.. చెలియా' టీజర్‌ విడుదల

‘ఓ.. చెలియా’ టీజర్‌ విడుదల

- Advertisement -

ఎస్‌ఆర్‌ఎస్‌ మూవీ క్రియేషన్స్‌, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్‌, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం.నాగ రాజశేఖర్‌ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్‌.. అన్నీ కూడా జనాల్లోకి బాగానే రీచ్‌ అయ్యాయి. రీసెంట్‌గా హీరో మంచు మనోజ్‌ ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. అది కూడా వైరల్‌ అవ్వడంతో సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా హీరో శ్రీకాంత్‌ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’నాకు టీజర్‌ చాలా నచ్చింది.

యంగ్‌ టీమ్‌ అంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు. హర్రర్‌, లవ్‌, యాక్షన్‌ జోనర్లను మిక్స్‌ చేయటంతో భయపెట్టించే అంశాలు చాలానే ఉన్నాయని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ హర్రర్‌ కాన్సెప్ట్‌లో చేసిన ఈ ప్రేమ కథ ఏంటి?, మధ్యలోకి ఈ దెయ్యాల కాన్సెప్ట్‌ ఎలా వచ్చింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఈ టీజర్‌లో సురేష్‌ బాలా కెమెరా వర్క్‌, ఎంఎం కుమార్‌ ఆర్‌ఆర్‌ హైలెట్‌ అవుతోంది. ఈ చిత్రానికి ఉపేంద్ర ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం అని అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -