నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేశాయి. ఇదే కేసులో జూలై 18న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అదుపులోకి తీసుకున్నది. దీంతో అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా కోర్టు నుంచి ప్రొడక్షన్ వారెంట్ పొందిన ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకున్నది. ఆయనతోపాటు మరొక నిందితుడి దీపెన్ చావ్డాను అక్టోబర్ 6 వరకు కోర్టు ఏసీబీ కస్టడీకి అప్పగించింది.
గత జనవరిలో నమోదు చేసిన ఈ కేసులో అవినీతి, క్రిమినల్ కోణాలపై ఏసీబీ/ఈఓడబ్ల్యూ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారం రూ. 2,500 కోట్లకు పైగా విలువైనదని ఆరోపణలు ఉన్నాయి. చైతన్య బగేల్ రూ.1000 కోట్ల విలువైన మద్యం సిండికేట్‌ను నడిపట్లు గుర్తించిమాని ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిండికేట్‌ను నిర్వహించడానికి దాని సభ్యులకు అప్పటి ఐఏఎస్ అధికారి అనిల్, వ్యాపారవేత్త అన్వర్ ధేబర్ సహకరించించినట్లు ఆరోపింది. 2019-2022 మధ్య భూపేష్ బగేల్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.