రాష్ట్రంలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెం.మీటర్లు, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 4, మంచిర్యాల జిల్లా భీమినిలో 3.5, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలో 2.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Spread the love