- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో కాల్పుల మోతకు బ్రేక్ పడింది. ఇజ్రాయిల్‌పై దాడులు ఆపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, తమ మిత్రపక్షమైన లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగితే మాత్రం తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో ఇరాన్ తాజా ప్రకటనతో శాంతి వాతావరణం ఏర్పడింది.
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ .. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించారు. ట్రంప్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్‌పై సైనిక చర్య నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- Advertisement -



