Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన 

గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన 

- Advertisement -

పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి
నవతెలంగాణ – చారకొండ

మండలంలోని శిరసనగండ్ల గ్రామంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి  గురువారం శంకుస్థాపన చేశారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానమును దర్శించుకొని ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఇండ్లను కోల్పోయిన బాధితుల  ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. శిరసనగండ్ల గ్రామంలో పాఠకుల సౌకర్యం కోసం శాశ్వత గ్రంథాలయ కోసం రెండు లక్షల నిధులతో  భవన నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ..ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. గ్రంథాలయ భవనం పూర్తి అయ్యాక విద్యార్థులు చదవడానికి, అధ్యయనం చేయడానికి, పరిశోధనలు చేయడానికి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రంథాలయం మంచి పఠన అలవాట్లను పెంపొందించడానికి సహాయపడతాయి. జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని  అందిస్తుందన్నారు.విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించి, సమాచారాన్ని విశ్లేషించగల సామర్థ్యాన్ని పెంచుతాయనీ అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మండల నాయకులు  అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గౌడ్, నాయకులు గోరేటి శివ, కేశమోని శంకరయ్య, గుండె శివ, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -