Friday, September 26, 2025
E-PAPER
Homeసినిమాగోట్‌ ఫైట్‌ నేపథ్యంలో 'జాకీ'

గోట్‌ ఫైట్‌ నేపథ్యంలో ‘జాకీ’

- Advertisement -

భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్‌ నేపథ్యంలో రూపొందిన ‘మడ్డీ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహాంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచడానికి డా.ప్రగభల్‌ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జాకీ’. పీకే7 స్టూడియోస్‌ సమర్పణలో డైరెక్టర్‌ డా|| ప్రగభల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల అయింది. ‘వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్‌ ఫైట్‌ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా మధురైౖలో సాంప్ర దాయంగా కొనసాగుతున్న ఈ గోట్‌ ఫైట్‌ చుట్టూ అల్లుకున్న కథతో దీన్ని తెరకెక్కించాం. కేవలం ఫైట్స్‌ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమా ఉంటుంది. రియల్‌ లోకేషన్స్‌లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నాను. సహజ సిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీదీ తెలుసుకొని జాగ్రత్తగా షూట్‌ చేశాం’ అని దర్శకుడు ప్రగభల్‌ చెప్పారు. యువన్‌ కృష్ణ, రిధాన్‌ కృష్ణన్‌, అమ్ము అభిరామి, మధు సుధన్‌ రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం : డాక్టర్‌ ప్రగభల్‌, నిర్మాత: ప్రేమ కృష్ణదాస్‌, సీ దేవదాస్‌, సినిమాటోగ్రఫీ: ఉదయకుమార్‌, సంగీతం: సక్తి బాలాజీ, ఆర్ట్‌ డైరెక్షన్‌: సి.ఉదయకుమార్‌, సౌండ్‌: రాజా కృష్ణన్‌, ఫైట్‌ మాస్టర్‌: జాకీ ప్రభు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -