- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కొత్త లిక్కర్ షాపులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా తీసి షాపులను కేటాయిస్తారు. టెండర్ ఫీజు రూ.3లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో, అప్లికేషన్ల ద్వారా రూ.400 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్స్ కాలపరిమితితో షాపుల కేటాయింపు ఉంటుంది.
- Advertisement -