Monday, October 20, 2025
E-PAPER
Homeసినిమాఅన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా

- Advertisement -

”కె ర్యాంప్‌’ మూవీని మేమంతా చూశాం. సినిమా చూస్తూ అన్ని ఏజ్‌ గ్రూప్స్‌ వాళ్లం చాలా ఎంజారు చేశాం. సినిమా సక్సెస్‌ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ దీపావళికి థియేటర్స్‌కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు.
హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్స్‌ రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కె-ర్యాంప్‌’. జైన్స్‌ నాని దర్శకత్వం వహించారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 18న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం మేకర్స్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్‌ జైన్స్‌ నాని మాట్లాడుతూ,’ఈ సినిమా ఫుల్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. నువ్వు స్క్రిప్ట్‌లో ఎంత రాస్తే అంత పర్‌ఫార్మ్‌ చేస్తా అని కిరణ్‌ నన్ను ఎంకరేజ్‌ చేశారు. హీరోయిన్‌ క్యారెక్టర్‌ కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమా బాగా రావాలి అని నేను సినిమా కోసం ఏది అడిగినా మా ప్రొడ్యూసర్స్‌ రాజేష్‌, శివ ఇచ్చారు’ అని తెలిపారు. హీరోయిన్‌ యుక్తి తరేజా మాట్లాడుతూ,’ఈ మూవీలో నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నా’ అని తెలిపారు. నరేష్‌ మాట్లాడుతూ,’ఈ కథ విన్నప్పుడు ఇది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని చెప్పేశాను. ఈ వేదిక మీద నుంచి కూడా చెబుతున్నా ఇది బ్లాక్‌ బస్టర్‌ మూవీ’ అని అన్నారు.

ఈ కథ విన్నప్పుడు మా సంస్థలో మరో ఎంటర్‌టైనర్‌ అని ఫిక్స్‌ అయ్యా. షూటింగ్‌ చేస్తున్నప్పుడు నరేష్‌ ఒక కాంప్లిమెంట్‌ ఇచ్చారు. జైన్స్‌ నానితో ఇండిస్టీకి మరో త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ దొరికినట్లే అన్నారు. చేతన్‌ భరద్వాజ్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. మా సంస్థలో రాబోయో 3 ప్రాజెక్ట్స్‌కు ఆయనే సంగీతం అందిస్తారు. మా మూవీలో ఓనమ్‌ సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఒక బ్రదర్‌తో సినిమా చేస ినంత హ్యాపీగా కిరణ్‌తో మూవీ చేశా. ఈ దీపావళికి పోటీ ఎంత ఉన్నా, మా మూవీ సక్సెస్‌ మీద పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

  • నిర్మాత రాజేష్‌ దండా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -