‘దేవర2’ అప్‌డేట్ కోసం
ఎంతగానో ఎదురు చూస్తున్న వారందరికీ నిర్మాణ సంస్థలు శనివారం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’.
గతేడాది సెప్టెంబర్ 27న రిలీజైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘దేవర’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థలు దీని సీక్వెల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘దేవర ప్రతి సముద్ర తీరాన్ని వణికించి నేటికి ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పేరు ఇది. తాను పంచిన ప్రేమ, తాను చూపిన భయం.. ఎప్పటికీ మర్చిపోలేరు. ‘దేవర2′ కోసం అందరూ సిద్ధంగా ఉండండి’ అని నిర్మాణ సంస్థలు సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టాయి. దీంతో త్వరలోనే ఈ సీక్వెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘దేవర’ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘దేవర 2’ కోసం సిద్ధంగా ఉండండి
- Advertisement -
- Advertisement -