Monday, October 20, 2025
E-PAPER
Homeసినిమాపోలీసుల పాత్ర అనిర్వచనీయం

పోలీసుల పాత్ర అనిర్వచనీయం

- Advertisement -

వరుణ్‌ సందేశ్‌, మధులిక వారణాసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్‌’. జాగతి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె దర్శకత్వంలో బలగం జగదీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్‌ పాటను ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌.నారాయణ మూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, గీత రచయిత చంద్రబోస్‌ ఆలపించడం ఓ విశేషం.
ఈ సందర్భంగా ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్‌ ఇతివత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. నేను ఆవిష్కరించిన ఎమోషనల్‌ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. ఆస్కార్‌ గ్రహీత చంద్రబోస్‌ ఈ పాటను ఆలపించి రక్తికట్టించారు. నా కళ్ళు చమర్చాయి. వరుణ్‌ సందేశ్‌కు ఇది కమ్‌బ్యాక్‌ చిత్రం కావా’ అని అన్నారు.
‘నేను ఇంతవరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఇందులో నా పాత్ర ఉంటుంది’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. నిర్మాత బలగం జగదీశ్‌ మాట్లాడుతూ, ‘అక్టోబర్‌ 10న దాదాపు 500 థియేటర్లకు పైగా ప్రంపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నైజాంలో ఏషియన్‌ ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ రిలీజ్‌ చేస్తోంది’ అని తెలిపారు. ‘ట్రైలర్‌తోపాటు ఎమోషనల్‌ సాంగ్‌కి వస్తున్న స్పందన చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి చిత్రాలు రావాలని కోరుకునేలా ఉంటుంది’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ చెప్పారు.

  • ఆర్‌.నారాయణమూర్తి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -