సినీనటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాగా ఆడుతుం దనుకుంటున్న తరుణంలో ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలిసేందుకు వెళ్లారట. ఈ సంద ర్భంగా ఆయన బిజీగా ఉండటంతో సినిమా టోగ్రఫి మంత్రిని కలువాలని సూచించారట. సీఎంను కలవాలని వస్తే మంత్రిని కలవాలని చెప్పడం ఏమిటంటూ చిరంజీవి ప్రశ్నించడంతో అప్పుడు జగన్మోహన్‌రెడ్డి వారిని కలిసినట్టు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభలో ఊగిపోయారు. చిరంజీవి చెప్పితేనే జగన్ కలిశాడనేది అబద్ధమన్నారు. అంతటితో ఆగకుండా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున తయారు చేసిన జాబితాలో తనది తొమ్మిదవ పేరు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అలా అలా మాట్లాడుతూ చివరకు సారీ…అంటూ కథ ముగించారు. దీంతో ఒక్కసారిగా సభ మౌనం దాల్చింది. పవన్‌కళ్యాణ్ అన్న చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూటమి సర్కారు స్పందించలేదు.పైగా చిరంజీవిని అంటుంటే నవ్వుకోవడం కనిపించింది. డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న ‘త్రిబుల్‌ఆర్’ కూడా దానిపై మాట్లా డకుండా వెరీగుడ్ అంటూ బాలయ్యను ప్రశంసించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా చర్చను ప్రారంభించారు. సొంత అన్నపై బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓజీ మౌనం దాల్చారు. అటు బాలయ్యను ఖండించలేక, ఇటూ కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ ఎమ్మెల్యేలను ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఉండటం ‘ఓజీ’ వంతైంది!
- గుడిగ రఘు