Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

- Advertisement -

– మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 29వ తేదీ సోమవారం స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి ఆదివారం తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో చర్మ వ్యాధులు నిపుణులు డాక్టర్ స్వాతి, నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, దంత వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రవీణ్ పాల్గొని చికిత్సలు అందిస్తారని ఆయన తెలిపారు. శిబిరానికి హాజరైన రోగులకు ఉచిత రక్త పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలతోపాటు, మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నరసింహస్వామి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -