Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో వీసీ సజ్జనార్ ప్రయాణం..

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో వీసీ సజ్జనార్ ప్రయాణం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని చాటుకున్నారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. బస్ భవన్‌ స్టాప్‌లో ఆయన దిగిన అనంతరం ఆఫీస్‌లోకి వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా సోమవారం టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ షేర్ చేసింది. “నా స్టాప్ వచ్చింది అంటూ పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో ఎండీగా నాలుగేళ్లు పని చేసిన నేను.. బస్సు నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ప్రయాణాలు ఆగుతాయి.. ప్రయాణికులు ముందుకు సాగుతారు, కానీ రహదారి ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందని తెలిపారు”. నేను ఇప్పుడు బస్సును నిలిపి, తదుపరి సవాళ్ల వైపు వేగంగా దూసుకెళ్లాల్సిన సమయం ఇది అని వెల్లడించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కనడక్టర్లు, అధికారులు, ప్రయాణికులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -