Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలి

జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలి

- Advertisement -

బోధన్ సబ్ కలెక్టర్ కువినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలంగా ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఇంతవరకు ఎస్టికి గాని, ఎస్సీకి గాని కేటాయించకపోవడం బాధాకరమని, బహుజన నేతలు నీరడి రవి (ఎస్సీ) సిరివేసు సంతోష్ (బి సి) జాదవ్ ప్రవీణ్ నాయక్ (ఎస్టి)లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మేహతో కు వినతి పత్రం అందజేశారు. జనాభా ప్రాతిపదికన మండలంలో ఎస్సీ, ఎస్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇంతవరకు రిజర్వేషన్ కల్పించకపోవడం శోచనీయమన్నారు.

ప్రస్తుతం రొటేషన్ పద్ధతి ప్రకారం సీట్లు కేటాయిస్తున్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించకపోవడం బాధాకారం అన్నారు. కాబట్టి ఈసారైనా ఆ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని విన్నవించారు. లేని యెడల దళిత బహుజన పక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కో కన్వీనర్ నీ రెడీ రవి, బీసీ విద్యార్థుల సంఘం జిల్లా అధ్యక్షులు సిరివేసు సంతోష్, గిరిజన విద్యార్థుల సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్, బహుజన నాయకులు సుభాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -