- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథంగల్లి ప్రాంతంలో గల పశువుల నీటి తొట్టిని గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఎప్పటికప్పుడు కార్మికులతో శుభ్రం చేయిస్తున్నారు. దీంతో జీపీ కార్యదర్శి సేవలు మరువలేని విధంగా ఉన్నాయని, ఆయన పనితీరుపై గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో పశువుల నీటితొట్లను శుభ్రం చేయించారు. దీంతో ఆయన పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -