Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జేసీబీ యూనియన్ మండల అధ్యక్షుడిగా రాము

జేసీబీ యూనియన్ మండల అధ్యక్షుడిగా రాము

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
జేసీబీ యూనియన్ మండల అధ్యక్షుడిగా పెద్దవంగర గ్రామానికి చెందిన శ్రీరాం రాము (పురుషోత్తం) ఎన్నికయ్యారు. జేసీబీ యూనియన్ మండల నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షుడిగా గుగులోత్ పటేల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ జెతిరాం నాయక్, కోశాధికారిగా దండుగల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా భూక్యా మహేష్, గుగులోత్ వినిత్,  ఓర్సు సందీప్, శివరాత్రి రాజు, గుగులోత్ దేవా, జాటోత్ బాలాజీ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -