జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో
నవతెలంగాణ – కంఠేశ్వర్ :
జాతీయ బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం నాందేవాడ లో గల దాత్రిక రవి కుటుంబానికి బుధవారం ఆర్థిక సహాయం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా వంజరి సంఘం, నగర సంఘం లో కీలక బాధ్యతలు చేశారు. దాత్రిక రవి ఆరోగ్యం బాలేనందున గత రెండు సంవత్సరాల కిందట పెరాలసిస్ రావడంతో ఉన్న ఇల్లుని అమ్ముకొని ప్రస్తుతం బ్రతకడమే కష్టంగా జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపద్యంలో దత్రిక రవి కి, ఆయన కుమారునికి సంబంధించిన నోట్ బుక్స్, పెన్స్ అందజేసినట్లు ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా నవతె ప్రతాప్ మాట్లాడుతూ.. వంజరి సంఘం అభివృద్ధి కొరకు తనవంత కృషి చేసినటువంటి దాత్రికి రవి కి జిల్లా వంజరి సంఘం, నగర, రాష్ట్ర వంజరి సంఘం నుండి ఆర్థికంగా లేదా తమకు తోచిన విధంగా వీరి కుటుంబానికి వారి కుమారునికి చదువు కొరకు తమ వంతు కృషి చేయగలరు అని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు గణేష్ యాదవ్, గంగోని వంశీకృష్ణ, గంగాధర్, శ్రావణ్, శ్రీను, కరీపే రాజు, ప్రవీణ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
పెరాలసిస్ బాధితుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES