Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికులకు వెన్నంటే ఉంటా 

కార్మికులకు వెన్నంటే ఉంటా 

- Advertisement -

వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యాకయ్య గౌడ్ 
నవతెలంగాణ-పాలకుర్తి

కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు కార్మికులకు వెన్నంటే ఉంటానని విఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి యాకయ్య గౌడ్ కార్మికులకు భరోసా ఇచ్చారు. బుధవారం మండల కేంద్రంలో గల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ ప్రజాస్వామ్యక కార్మిక సంఘం పోస్టర్ను ఆవిష్కరించారు. జనగామ జిల్లా కన్వీనర్ గడ్డం బాబు అధ్యక్షతన జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రజాస్వామిక  కార్మిక సంఘం నాయకులు తూటి.పరిషరాములు, ప్యారపు.సోమయ్య, సంగి.వెంకన్న, ఏడబెల్లి యాకన్న, పిట్టల సతయ్య, కోడిశాల సోమయ్య, గోగుల సంపత్, మంగ శోభన్ బాబు, సోమ శ్రీకాంత్, పాలకుర్తి మండల  అధ్యక్షులు ఇరుగు.అశోక్, దండంపెల్లి.ఆంజనేయులు, పాలడుగు ప్రశాంత్, చిటూరి. ప్రభాకర్, బండిపెల్లి ఉపేందర్, మోత్కుపల్లి విజయ్, మాధవరెడ్డి, నగేష్,గుగులోతు మంగ.  పెట్రోల్ బంక్ కార్మికలు, హమాలీ కార్మికులు, గీత కార్మికులు తదితర కార్మిక సోదరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -